Wednesday, 12 June 2013

Ram charan Fan Following in Japan

రజనీ తర్వాత రామ్ చరణే : జపాన్‌లో చరణ్ పేరుతో బిస్కట్లు Posted by: Bojja Kumar Published: Wednesday, June 12, 2013, 14:21 [IST] Ads by Google Latest Dulux Paints  Dulux Interior & Exterior Colours For Your Designer Home. Visit Us! www.dulux.in Buy Motor Insurance  Get upto 65% No Claim Bonus & 100% Depreciation covered. Buy online. Bharti-axagi.co.in/Car_Insurance రామ్ చరణ్   వినోద, గాసిప్ వీడియోలను కేవలం ఒక్క రూ. 1కే చూడండి. హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖ్యాతి జపాన్ దేశం వరకు పాకింది. రామ్ చరణ్ క్రేజ్ అక్కడ ఏ రేంజిలో ఉందంటే.......చరణ్ పేరు, ఫోటోతో బిస్కట్ ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్నాయి అక్కడి కంపెనీలు. ఇంతకీ రామ్ చరణ్ జపాన్‌లో ఇంత పాపులర్ ఎలా అయ్యాడా అని ఆలోచిస్తున్నారా...? అయితే మీరు ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర' చిత్రం జపాన్లో కూడా విడుదలైంది. అక్కడ ఈ చిత్రం జపనీస్ సబ్ టైటిల్స్‌తో ప్రదర్శించారు. ఆ సినిమా జపనీయులకు బాగా నచ్చడంతో రామ్ చరణ్‌కు అభిమానులు అయిపోయారు. అక్కడ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్‌ క్యాష్ చేసుకోవాలనుకున్న Ezaki Glico Co.Ltd అనే ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ ‘చరణ్ లవ్' పేరుతో అతని బొమ్మ చిత్రీకరించిన క్రీమ్ బిస్కట్లను మార్కెట్లోకి వదిలింది. ‘చరణ్ లవ్' బిస్కట్లు అక్కడ బాగా అమ్ముడవుతున్నాయట. ఇప్పటి వరకు అక్కడ.... $ 3,416,097 యూఎస్ డాలర్ల విలువ చేసే బిస్కట్లు అమ్ముడయ్యాయట. ఆ కంపెనీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, అక్కడి మార్కెట్లో బాగా స్టడీ చేసి మరీ చరణ్ పేరును ఎంపిక చేసారట. ఇప్పటి వరకు దక్షిణాది హీరోల్లో కేవలం రజనీకాంత్‌కు మాత్రమే జపాన్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ దెబ్బతో రామ్ చరణ్ కూడా అక్కడ మంచి పాపులారిటీ సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చరణ్ జపాన్‌లో ఇలా పాపులర్ కావడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment