Friday, 23 May 2014

RTA change register vehicals numbers,AP and TG

మీ బండి నెంబర్ మారుతోంది.


రాష్ర్ట విభజన నేపథ్యంలో వివిధ శాఖలు రాష్ర్టాల వారీగా వేరవుతున్నాయి. తాజాగా రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీఏ) విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో తమ కార్యకలాపాలు నడిపించుకునేందుకు వీలుగా ముందస్తు కసరత్తు ప్రారంభించేసింది.

ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్జాతీయ చెక్ పోస్ట్‌ల ఏర్పాటులో ఓ స్పష్టతకు వచ్చిన ఆ శాఖ ఇప్పుడు ఇరు రాష్ర్టాల్లో ఇకపై కొనసాగబోయే వాహన రిజిస్ట్రేషన్ల నంబర్ల విషయంలోనూ ముందడుగేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 01 నుంచి 15 వరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో 01 నుంచి 13 వరకు టీడీ, ఏపీ అంటూ కోడ్ నెంబర్లు వుంటాయని సమాచారం.